అర్థం – గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి, ఎడమవైపు ఎల్లపుడు గౌరీదేవి వలన అలంకరింపబడి, నారాయణునకు ఇష్టమైన వాడు, అనంగుని (కామదేవుని) మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణములయొక్క స్వరూపము కలిగి, వాగీశ (బ్రహ్మ), విష్ణు మరియు సురులచే సేవింపబడు పాదములను కలిగి, ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – భూతములకు రాజుగా, సర్పములను శరీర ఆభరణములుగాచేసికొని, పులిచర్మముమును వస్త్రముగా కట్టుకుని, జటాజూటమును, మూడుకన్నులను కలిగి, పాశమును (త్రాడు), అంకుశమును (గాలము), భయములేనిది, వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకొనియున్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటముగా చేసుకొని, నుదుటి కంటి మంటలో అయిదు బాణములను విలీనము చేసుకొని, సర్పములయొక్క రాజుని చెవికి ఆభరణముగా చేసుకొని, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహమువంటి వాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు, బాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – దివ్యతేజస్సు కలిగి, గుణములు ఉండి గుణములు లేక, మరొకటిగా లేక, ఆనందమునకు మూలమై, ఎవ్వరిచేత ఓడింపబడక, ఎవ్వరి ప్రమేయము అవసరములేక, నాగాభరణములు కలిగి, కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – ఆశలను విడిచి, పరులను నిందింపక, పాపములలో ఆనందము అనుభవింపక, మనస్సును సమాధి స్థితియందు ఉంచి, మనస్సు అనే కమలము పట్టుకొని మధ్యలో ఉన్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – రాగము వంటి దోషములు లేక, స్వజనులతో అనురాగముతో ఉండి, వైరాగ్యమనెడి శాంతికి నిలయమై, గిరిజతో కూడి, ధైర్యమనెడి మాధుర్యమును చూపుతూ, విషమువలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
అర్థం – వారాణసీపురపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకముల స్తవము పఠించు మనుషులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి, కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగును.
(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)